19 జిల్లాల్లో కుల గణన సర్వే పూర్తి
NEWS Nov 30,2024 02:47 am
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే 33 జిల్లాలకు గాను 19 జిల్లాల్లో పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సర్వే దేశానికి రోల్ మోడల్ కావాలని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన తమ కుటుంబ వివరాలను జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో అందజేశారు.