ముంచుకొస్తున్న ఫెంగల్ తుఫాన్
NEWS Nov 30,2024 02:40 am
నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ముంచుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ హెచ్చరించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.