దీక్షా దివస్ బిగ్ సక్సెస్
NEWS Nov 29,2024 03:16 pm
చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే దినం నవంబర్ 29 అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీక్షా దివస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని , ఈ సందర్బంగా పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన బాటలో కేసీఆర్ నడిచారని, ఆయన అందించిన స్పూర్తి గొప్పదన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బతికే ఉంటారని స్పష్టం చేశారు.