చరిత్రాత్మక రోజు దీక్షా దివస్
NEWS Nov 29,2024 03:04 pm
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ రథసారథి కేసీఆర్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. దీక్షా దివస్ సందర్బంగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. త్యాగాలు, బలిదానాల సాక్షిగా తెలంగాణ ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఆనాడు గనుక పోరాటం చేయక పోయి ఉండి వుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు. దీక్షా దివస్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు.