వైఎస్ షర్మిల జగన్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సెకీ ఒప్పందానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరో ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడితే ఎలా అంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అదానీ కోసం తాము పరుగులు తీయలేదన్నారు. జగన్ పై బురద చల్లడం మానుకోవాలని సూచించారు.