జిల్లా గెజిటెడ్ అధికారుల నూతన
కార్యవర్గానికి కలెక్టర్ అభినందనలు
NEWS Nov 29,2024 05:13 pm
జిల్లా అభివృద్ధికి గెజిటెడ్ అధికారుల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నూతనంగా ఏకగ్రీవం ఎన్నికైన నిర్మల్ జిల్లా కార్యవర్గాన్ని కలెక్టర్ అభినందించారు. జిల్లా అభివృద్ధికి గెజిటెడ్ అధికారుల సహకారం ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు, రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. టీజీవోల భవనానికి స్థలం కేటాయించాలని టీజీవో నాయకులు విజ్ఞప్తి చేశారు.