పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ
NEWS Nov 29,2024 11:39 am
గౌతమ్ అదానీకి సంబంధించిన అంశం మరోసారి పార్లమెంట్ ను కుదిపేసింది. వరుసగా నాలుగో రోజు అదానీ గ్రూప్ అవినీతిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. అదానీ అంశంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తిర్మనాలను తిరస్కరించారు లోక్ సభ, రాజ్యసభ సభాపతులు. సభ్యులు అడ్డుకుంటే ఎలా అని మండిపడ్డారు. సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్స్.