పోర్టు అధికారులపై పవన్ కన్నెర్ర
NEWS Nov 29,2024 11:16 am
కాకినాడ పోర్టు అధికారులపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్రమంగా బియ్యం రవాణా కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తున్నానని తెలిసి ఎస్పీ సెలవులో ఎలా వెలతాడంటూ ప్రశ్నించారు. పోర్ట్ అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేశారు . ప్రతీ ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందేనని హెచ్చరించారు. ఇవాళ బియ్యం, రేపు డ్రగ్స్ , ఎల్లుండి ఆర్డీఎక్స్ కూడా రవాణా చేస్తారా అంటూ నిలదీశారు.