ఏపీ సర్కార్ పై గుడివాడ కామెంట్స్
NEWS Nov 29,2024 10:46 am
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు అదానీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని అన్నారు. సెకీతో పలు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్న విషయం చంద్రబాబు మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. తక్కువ ధరకు మన రాష్ట్రమే ఒప్పందం చేసుకుందని, అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదన్నారు. ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నది మీరేనని కావాలంటే రద్దు చేయొచ్చంటూ హితవు పలికారు.