నిర్మల్ జిల్లాలో BRS దీక్ష దివాస్
NEWS Nov 29,2024 10:40 am
నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామం వద్ద గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అరిపించిన అనంతరం కెసిఆర్ తెలంగాణ సాధనకై చేసిన పోరాటం, నిరాహార దీక్ష, ఆయన త్యాగాలకు సంబంధించిన డాక్యుమెంటరీ వీడియోను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్సి షేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.