మరాఠా పీఠంపై వీడని సస్పెన్స్
NEWS Nov 29,2024 10:33 am
మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే మధ్య పోటీ నెలకొంది. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వద్దంటూ స్వంత ఊరికి వెళ్లి పోయారు షిండే. మరో వైపు పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు ట్రబుల్ షూటర్ అమిత్ షా. ఆర్థిక మంత్రిగా అజిత్ పవార్ కు కన్ ఫర్మ్ అయినట్టు సమాచారం. ఇక హోం మంత్రి, డిప్యూటీ సీఎం పోస్టులు ఎవరికి దక్కుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.