లగచర్లలో భూసేకరణ చేపట్టడం లేదంటూ ప్రభుత్వం ప్రకటించడం ప్రజలు సాధించిన విజయంగా పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి చివరకు తన ఆనవాళ్లు ఉంటాయో లేదో చూసు కోవాలని అన్నారు. బాధితులకు ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ వచ్చిందని స్పష్టం చేశారు. ఇకనైనా సీఎం మారితే మంచిదని హితవు పలికారు.