లగచర్లలో భూసేకరణ ఉపసంహరణ
NEWS Nov 29,2024 10:27 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా అక్కడ తమ భూములు ఇవ్వబోమంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు, రైతులు ఆందోళన చేపడుతున్నారు. భూ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కుడా కమిషనర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో భూ సేకరణ చేయబోమంటూ ప్రకటించింది సర్కార్.