అక్రమ బియ్యం రవాణాపై పవన్ ఫైర్
NEWS Nov 29,2024 08:52 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా బియ్యం రవాణపై కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. విచారణ చేపట్టాలని ఆదేశించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం తరలించేందుకు సిద్దంగా ఉన్న 1064 టన్నుల బియ్యం సంచులను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. బహిరంగంగానే బియ్యం అక్రమంగా తరలి పోతుంటే ఏం చేస్తున్నారంటూ సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్.