అమరుల త్యాగ ఫలితం తెలంగాణ
NEWS Nov 29,2024 08:38 am
బలిదానాలు, త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ నిర్వహించారు. అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి. కేసీఆర్ గనుక పోరాటం చేసి ఉండక పోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. పోరాటాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరు తెలంగాణ అని అన్నారు.