ఆసిఫాబాద్ జిల్లాలో పులి ఓ యువతిని బలితీసుకుంది. కాగజ్‌నగర్ మండలం గన్నారం శివారులో మోర్లె లక్ష్మి (21) పత్తి తీయడానికి వెళ్లగా ఆమెపై పులి దాడి చేసింది. అక్కడే ఉన్న తోటి కూలీలు కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. మృతదేహంతో మహిళ బంధువులు కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.