డిసెంబర్ 1న కబడ్డీ జట్టు ఎంపిక
NEWS Nov 29,2024 03:20 pm
డిసెంబర్ 1న రఘునాథపల్లి మండలం నిడిగొండలోని సెయింట్ పీటర్ ఫౌండేషన్ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక చేయనున్నారని, కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని సీనియర్ మహిళలు పాల్గొని ప్రతిభ చూపాలని కోరారు. ఎంపికైన జిల్లా జట్టు వచ్చే నెల 7 నుంచి 10 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.