తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి
NEWS Nov 29,2024 04:17 am
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మన్యంలో చలి గత ఏడాది నవంబర్‌లో 13-13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి మరో 5డిగ్రీలు తగ్గిపోయాయి. డుంబ్రిగూడలో, జి.మాడుగుల, జీకే వీధి, హుకుంపేట, అరకులోయలో9లోపు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యులో 7.9, ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 9.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.