నిర్మల్ జిల్లా: నిర్మల్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు చెందిన ప్రజలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని దానికి కారణం మహాత్మ జ్యోతిబాపూలే త్యాగఫలం అని పూలే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లాకు కన్వీనర్ కిషన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.