తాటిపల్లిలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
NEWS Nov 27,2024 05:45 pm
మల్యాల మండలం తాటిపల్లిలో ఫాతిమానగర్ ఆడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మానోస్ యూనిదాస్ ఆర్థిక సాయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ ను స్పెయిన్ దేశం నుంచి వచ్చిన రోషియా, ఆల్బాట్ లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫ్లోరైడ్ రహిత నీరు తాగడం వలన అనారోగ్యం దరిచేరదని, ఇలాంటి స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.