టీచర్స్‌ను సస్పెన్షన్ చేయడం సరికాదు
NEWS Nov 27,2024 08:53 am
జగిత్యాల జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా లేదని ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేయడం పట్ల జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులు బోయిన్‌పల్లి ఆనందరావు ఖండించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ పర్యవేక్షించిన అధికారులు ఇన్ఛార్జి ఉపాధ్యాయులను సస్పెండ్, మెమో జారీ చేయడం సరికాదన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో లోపాలను గుర్తించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.