కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్
NEWS Nov 26,2024 05:35 am
నిజామాబాద్ న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ కు చెందిన కాంత్రి కుమార్కు కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.