కోరుట్ల ఝాన్సీ రోడ్డులో ఇంట్లో చోరీ
NEWS Nov 25,2024 04:43 pm
కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్డులో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని 4 రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం ఇంటి చుట్టపక్కల వారు ఇంటి తలుపుల గొలుసులు కోసినట్టు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్ విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.