చలో మాల మహానాడు పోస్టర్ ఆవిష్కరణ
NEWS Nov 25,2024 03:44 pm
డిసెంబర్ 1న హైదరాబాదులో జరగబోయే మాల మహానాడు సింహ గర్జనకు తరలిరావాలని కథలాపూర్ మండల మాల నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం పట్ల ఎస్సై నవీన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైస శ్రీధర్, శంకర్, గంగాధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.