విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్‌గా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు.. నటుడిగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. నటుడిగా కొనసాగుతూనే.. నిర్మాతగా 75 చిత్రాలను మోహన్‌బాబు నిర్మించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు సెలెబ్రేషన్ వేడుకలు చేయబోతున్నారు. 2025 నవంబర్ వరకు ప్రతి నెల 1న ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని విష్ణు తెలిపారు.