జగిత్యాలలో అంతర్జాతీయ పిల్లల దినోత్సవం
NEWS Nov 20,2024 02:21 pm
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ SKNR ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ పిల్లల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే ఇంటర్నెట్ వనరులను దేశాభివృద్ధికే తప్పా దాంతో తప్పుదోవ పట్టరాదన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.