అయినవిల్లికి చెందిన దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్ర సాద్ హత్యకేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అమలాపురంకి చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు న్యాయ స్థానం బెయిల్ నిరాకరించింది. అమలాపురం లోని కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు శ్రీకాంత్ కు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వి. నరేష్ బెయిల్ నిరాకరించారు.