మోడల్ స్కూల్ సందర్శించిన ఎమ్మెల్యే
NEWS Nov 19,2024 04:24 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. పాఠశాలలో ఉన్న పలు సమస్యలను ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.