మల్లాపూర్ మండల కేంద్రంలో స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న దుర్గమ్మ కాలనీలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తుంటాయి. కాలనికి వెళ్లే దారిలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కి కాలనీవాసులు వినతి పత్రం అందించారు. గత కొన్నేళ్లుగా కాలనీలో స్ట్రీట్ లైట్ లేక రాత్రుల్లో వచ్చి పోయేవారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు.