బాస భూమయ్య అంత్యక్రియల్లో జువ్వాడి
NEWS Nov 19,2024 08:42 am
కోరుట్ల: వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అనుచరుడు, మాజీ సర్పంచ్ బాస భూమయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రగాఢ సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. బాస భూమయ్య పార్థివదేహం మీద కాంగ్రెస్ జెండాను ఉంచి నివాళులు అర్పించారు. ప్రజాప్రతినిధులు, బంధు మిత్రులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.