రెండు తలల పాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలోని ఒక పూజారి ఇంటి సమీపంలో కనిపించింది. ఒక గ్లాస్ లో తల ఇరుక్కుని, గ్లాస్ నుండి బయటకు రాలేక ఇబ్బంది పడింది. పూజారి మారుతి శర్మ గ్లాస్‌లో ఇరుక్కున్న పామును బయటకు తీసి, ముద్దాడారు. అక్కడే వదిలిస్తే ఎవరైనా ఎత్తుకెళ్ళి అమ్మేస్తారని, ఆ పామును స్థానిక ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఆ పామును ఫారెస్ట్ అధికారులు అడవిలో వదిలిపెట్టారు.