విద్యార్థులే అధ్యాపకులుగా మారిన వేళ
NEWS Nov 14,2024 04:26 pm
మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం బాలల దినోత్సవ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులు అధ్యాపకులుగా మారారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. అధ్యాపకులుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.