లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
NEWS Nov 14,2024 05:03 pm
జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పథకాలపై డ్వామా పిడి, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఎంలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.