ఆకతాయిల ఆగడాలను అరికట్టండి
NEWS Nov 14,2024 04:29 pm
మల్లాపూర్ మోడల్ స్కూల్ బస్టాండ్ వద్ద వేచి ఉండే అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తున్నారని, అదే పనిగా బైక్‌లపై రైడింగ్‌లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం స్థానిక ఎస్సై కిరణ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఎస్సై బస్టాండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలు అమరుస్తామని, పెట్రోలింగ్ జరుపుతూ విద్యార్థులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.