ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
NEWS Nov 14,2024 10:09 am
మల్లాపూర్: బాలల దినోత్సవన్ని పురస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులతో సంబరాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇంటి వద్ద తయారు చేసిన వివిధ రకాల వంటకాలను పాఠశాలకు తీసుకొచ్చి అందరికీ అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భూమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెంకటేష్, నాగన్న శ్రీకాంత్, షబ్బీర్, మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.