వాలీబాల్ క్రీడాకారులకు యూనిఫామ్స్ పంపిణీ
NEWS Nov 14,2024 09:10 am
కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామంలో క్రీడాకారులకు నేడు ఎస్సై నవీన్ చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడాకారులకు యూనిఫామ్ ను అందించిన దాత మండలోజి శ్రీనివాసును ఎస్సై అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు కనపర్తి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి ఉన్నారు.