పోసానిపై పోలీస్ స్టేషన్‌లలో కేసులు
NEWS Nov 13,2024 05:40 pm
టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడుపై సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ చైర్మన్‌పై వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పోసాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.