మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామంలో అక్రమంగా దాచి ఉంచిన కలపను బుధవారం మండల ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. బీట్ ఆఫీసర్ ఇలియాస్ ఆధ్వర్యంలో చేసిన రైడ్లో భాగంగా రూ. 25,000 విలువ గల 16 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా కలపను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.