దివ్యాంగుల సంక్షేమ ఆశ్రమాలు, పాఠశాలలు
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
NEWS Nov 13,2024 05:22 pm
జగిత్యాల జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం నిర్వహించే ఆశ్రమాలు, పాఠశాలలు, వివిధ సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి డా.బి. నరేష్ తెలిపారు. అనుమతి లేకుండా ఆశ్రమాలు, విద్య సంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యంగుల సంక్షేమ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 15లోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.