AP: 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలు!
NEWS Nov 13,2024 04:34 am
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో 3 రోజులు పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.