కలెక్టర్ పై దాడి - సీఎం రేవంత్ స్పందన
NEWS Nov 12,2024 06:28 pm
TG: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాడి చేసిన వారిని వదిలిపెట్టం. దాడులను ప్రోత్సహించే వారిని కూడా వదిలిపెట్టం. దాడి చేసిన వారికి అండగా ఉన్న వారిని విడిచిపెట్టం. ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇలాంటి దాడులను BRS సమర్థిస్తుందా?’ అని ఢిల్లీలో మీడియాతో ప్రశ్నించారు.