జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన
NEWS Nov 12,2024 05:55 pm
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి ఇతర రెవెన్యూ అధికారులపై దుద్యాల మండలంలో జరిగిన దాడికి నిరసనగా జగిత్యాల కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు, టిఎన్జిఓస్ జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అధికారులపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆర్డీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.