ఘనంగా భక్తుల వీరప్ప జన్మదిన వేడుక..
NEWS Nov 12,2024 05:31 pm
టేక్మాల్ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప జన్మదిన వేడుకను మండల పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి వీరప్ప దంపతులకు పూల మాల వేసి కేకు తినిపించారు.అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు సలీమ్, రవి, సిద్దయ్య, సుప్రజ భాస్కర్, యేశ్వంత్ రెడ్డి, గోవింద్ చారి, మహేందర్, మతీన్, పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.