బిజీహళ్లిలో ఫిర్యాదుల పరిష్కార వేదిక
NEWS Nov 12,2024 06:23 pm
రొళ్ల మండలం బిజీ హళ్లి గ్రామంలో మంగళవారం స్థానిక అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలు కూడా ఇందులో అధికారుల దృష్టికి వినతుల రూపంలో అందించారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రెవిన్యూ సిబ్బంది కన్వీనర్ దాసిరెడ్డి, జీకే ఈరన్న, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.