పెద్దపల్లి పట్టణంలోని ఉదయ నగర్ చెందిన కుక్క అమృత, కుక్క భాగ్య, కుక్క పద్మ,ముగ్గురు కలిసి ఆర్ఆర్ గార్డెన్లోని పని ముగించుకొని తిరిగి వస్తుండగా రంగంపల్లి ఆదర్శనగర్ వద్ద రాజీవ్ రహదారిపై వెనుక నుండి కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో భాగ్య, అమృత అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు