HSBD: గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి 13 L కాల్వ భూ సేకరణ కొరకు సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో ఆర్డిఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభను కాల్వ బాధితులు బహిష్కరిస్తూ 13 L కాల్వ వలన విలువైన భూములు కోల్పోతున్నామని, అలాగే సుమారు 200పైగా రైతు కుటుంబాలు రోడ్డు మీద పడడం జరుగుతుందని వాపోయారు. వెంటనే 13 L కాల్వ రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.