అన్నమయ్య జిల్లా అభివృద్ధికి కృషి
NEWS Nov 12,2024 08:17 am
రైల్వే కోడూరు: అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా ముక్కారూపానంద రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ కూటమి నాయకులు సోమవారం ముక్కారూపానందరెడ్డిని కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అన్నమయ్య జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ముక్కారూపానంద రెడ్డి పేర్కొన్నారు.