రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు
NEWS Nov 10,2024 01:04 pm
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దృష్ట్యా రేపు నిర్వహించే ప్రజావాణి రద్దు అయ్యిందని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు అందరూ నిమగ్న మైనందున ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. కాగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజలు సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.