జగిత్యాల పట్టణానికి చెందిన మమతకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో రక్తం అవసరం పడగా.. పేషెంట్ బంధువులు మంజూర్ అనే వ్యక్తికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందన వచ్చింది. అతను జగిత్యాల జిల్లా ప్రాణదాతల సమూహం వాట్సాప్ గ్రూప్ లో సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన జగిత్యాల పట్టణానికి చెందిన హఫీజ్ సల్మాన్ యూసుఫ్ రక్త నిధికి వెళ్లి రక్తదానం చేశారు.