సారీతో సద్దుమణిగిన వివాదం
NEWS Nov 08,2024 07:48 am
కోరుట్లలోని ఓ ఫంక్షన్ హల్ లో ప్రోగామ్ కవర్ చేస్తున్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ పై పెళ్లి కి వచ్చిన బంధువులు దుర్భాషలాడుతూ అవమానించడంతో వివాదం తలెత్తింది. దీంతో విషయం తెలుసుకున్న మెట్ పల్లి, కోరుట్ల కెమెరా క్లబ్ యూనియన్ సభ్యులు అక్కడికి చేరుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వివాహంలో వివాదం ముదురుతోందని.పోలీసుల వరకు వెళ్లిందని కుటుంబ సభ్యులతో సహా దిగివచ్చి, ఫొటోగ్రాఫర్లకు బహిరంగ క్షమాపణ చెప్పడ తో సమస్య సద్దుమణిగింది.